Saturday, May 15, 2010

అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు ..?

అక్షయ  తృతీయ రోజు మనలో చాల మందికి తెలిసింది ఒకటే  అదే  బంగారం కొనడం .. కానీ ఎదుందుకు ఏమిటి అని ఎవరు ఆలోచించారు ..!! అస్సలు  అక్షయ తృతీయ అంటే లక్ష్మి దేవి కుభేరునికి ఈశ్వర్యని ప్రసాదించిన రోజు .. ఏదో అందరు బాగా పుబ్లిసిటీ చేసారు మనము కొనాలి అనుకుంటారు .. అంతే కాకుండా కొంటె లక్ష్మి దేవి ఎపుడు ఉంటుందని అంటారు .. ఇది చాల తప్పు  ఇలాంటి పుకార్లు కేవలం వ్యాపారం అభివృధి చేసుకోవడానికి కొంత మంది వ్యాపారాలు చేసిన మార్కెటింగ్ టిప్స్ అవి .. అంతే  కానీ ఇంకేమి  లేదు ..
                             కానీ మన శాస్త్రాల్లో  చుస్తే ఈ రోజున దానము చేయడము చాల మంచిదట .. బంగారం .. డబ్బు ..ధాన్యం.. వస్త్రాలు.. ఇలా ఏది వీలయితే అది దానం  చేయాలట అంతేకాని  దాచిపెతుకోవడం తప్పు .. మనకు అవసరానికి  మాత్రమే ఉంచి మిగిలింది పంచేయాలని  అర్థం ... ఈ రోజున దానం చేయడం వలన వచ్చే ఫలితం చాల ఎక్కువ .. 1 %  దానం చేస్తే 1౦౦ %  కలిసివస్తుందట  అది ఇందులోని  మర్మం ... సో ఫ్రండ్స్ వీలయితే మీరు ట్రై చేయండి పక్కన వారికీ చెప్పండి ..
అనవసరంగా  అందరు సెంటిమెంట్ గ ఒకే సారి కొని  ధరలు ఆకాశాన్ని అంటే ల చేస్తున్నాతునారు ..