Thursday, June 7, 2012

పెట్రోల్ విషయం లో ప్రక్కన దేశాలు చాలా మేలు

హలో  ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు . నేను  క్షేమము మరి మీరు ఎలా ఉన్నారు .

మన దేశంలో పెట్రోల్ ధరలు మధ్య తరగతి వాడినే కాదు డబ్బులు బాగా ఉన్నవాడిని కూడా భయపెడుతున్నాయి. ఎందుకంటే 1 లి.పెట్రోల్ పోయించుకోవాలంటే రు.80  పెట్టాల్సిందే. ఎప్పుడో ఒక సారి బీరు తాగితే వేదవ 80 రూపాయలు ఖర్చు చేస్తావ ..? అనేవాళ్ళు  మరి ఇప్పుడు ప్రతి లీటర్ కు 80 పెట్టాల్సిందే .. అష్టకష్టాలు పడి అప్పులు సప్పులు చేసి వాహనం కొంటె ఈ పెట్రోల్ పోయించడానికి ఉన్న బండి కాస్త అమ్మేయల్సిన పరిస్టితి దాపురించింది . పక్కన ఉన్న దేశాలు మేలు వారి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ధరలు నిర్ణయించారు.

మరి మన పరిస్తితి ఏంటి ..? కత్తి ఒకడిది నెత్తి ఒకడిది అన్నటుగా ఉంది పరిస్టితి..ఏమంటారు ..

ఏదో నాకు వచ్చిన కోపానికి ఇలా షేర్ చేసుకోవలినిపించింది .. 



Saturday, May 15, 2010

అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు ..?

అక్షయ  తృతీయ రోజు మనలో చాల మందికి తెలిసింది ఒకటే  అదే  బంగారం కొనడం .. కానీ ఎదుందుకు ఏమిటి అని ఎవరు ఆలోచించారు ..!! అస్సలు  అక్షయ తృతీయ అంటే లక్ష్మి దేవి కుభేరునికి ఈశ్వర్యని ప్రసాదించిన రోజు .. ఏదో అందరు బాగా పుబ్లిసిటీ చేసారు మనము కొనాలి అనుకుంటారు .. అంతే కాకుండా కొంటె లక్ష్మి దేవి ఎపుడు ఉంటుందని అంటారు .. ఇది చాల తప్పు  ఇలాంటి పుకార్లు కేవలం వ్యాపారం అభివృధి చేసుకోవడానికి కొంత మంది వ్యాపారాలు చేసిన మార్కెటింగ్ టిప్స్ అవి .. అంతే  కానీ ఇంకేమి  లేదు ..
                             కానీ మన శాస్త్రాల్లో  చుస్తే ఈ రోజున దానము చేయడము చాల మంచిదట .. బంగారం .. డబ్బు ..ధాన్యం.. వస్త్రాలు.. ఇలా ఏది వీలయితే అది దానం  చేయాలట అంతేకాని  దాచిపెతుకోవడం తప్పు .. మనకు అవసరానికి  మాత్రమే ఉంచి మిగిలింది పంచేయాలని  అర్థం ... ఈ రోజున దానం చేయడం వలన వచ్చే ఫలితం చాల ఎక్కువ .. 1 %  దానం చేస్తే 1౦౦ %  కలిసివస్తుందట  అది ఇందులోని  మర్మం ... సో ఫ్రండ్స్ వీలయితే మీరు ట్రై చేయండి పక్కన వారికీ చెప్పండి ..
అనవసరంగా  అందరు సెంటిమెంట్ గ ఒకే సారి కొని  ధరలు ఆకాశాన్ని అంటే ల చేస్తున్నాతునారు ..